హర్యానా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటినుంచి తాము ఆదిక్యంలో ఉన్నామని… కచ్చితంగా చివరి క్షణంలో అధికారంలోకి వస్తది తీరుతామని భూపేందర్ సింగ్ ప్రకటించారు. హర్యానాలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున కర్రి నాయకత్వంలో విజయం సాధించబోతున్నామని కూడా వివరించారు. చివరి రౌండ్ కంటే ముందు స్పష్టమైన మెజారిటీ సాధించి తీరుతామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే భూపేందర్ సింగ్ చెప్పినట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ.. కనిపించడం లేదు. ఉదయం నుంచి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఆదిత్యాన్ని ప్రదర్శించినప్పటికీ… ఇప్పుడు బిజెపి మ్యాజిక్ ఫిగర్ ని కూడా దాటేసింది. 46 మ్యాజిక్ ఫిగర్ కావాల్సి ఉండగా బిజెపి ప్రస్తుతం 49 లీడింగ్ లో ఉంది. అటు కాంగ్రెస్ 35 సీట్లలో లీడింగ్ లో ఉంది. మరో గంట పాటు ఇదే ట్రెండు కొనసాగితే కచ్చితంగా బిజెపి అధికారంలోకి రాబోతుందని చెప్పవచ్చు. ముచ్చటగా మూడోసారి బిజెపి హర్యానాలో జెండా ఎగరవేయనుంది.