భువనగిరిలో కారుకు కాంగ్రెస్ చెక్..ఆధిక్యం మారిందా?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటల్లో భువనగిరి పార్లమెంట్ కూడా ఒకటి. కొన్నేళ్ళ నుంచి ఇక్కడ కాంగ్రెస్ హవా నడుస్తోంది. పార్లమెంట్ స్థానంతో పాటు..ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ హవా నడుస్తోంది. కానీ 2014 ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. పార్లమెంట్ పరిధిలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలని దక్కించుకుంది.

ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయింది..భువనగిరి పార్లమెంట్ పరిధిలో..మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, జనగాం, ఇబ్రహీంపట్నం స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్, మునుగోడు స్థానాలని కాంగ్రెస్ గెలుచుకోగా, మిగిలిన స్థానాలని బి‌ఆర్‌ఎస్ గెలుచుకుంది. అయితే ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి స్థానాలని తక్కువ మెజారిటీలతో గెలుచుకుంది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. భువనగిరి ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..కేవలం 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఇక అసెంబ్లీ స్థానాల వారీగా చూస్తే..ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం రాగా, తుంగతుర్తి, ఆలేరు, జనగాంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం వచ్చింది. అయితే తర్వాత నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్య బి‌ఆర్‌ఎస్ లో జాయిన్ అయ్యారు. అటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ని వదిల్ బి‌జే‌పిలో చేరి..ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో మునుగోడు సీటు బి‌ఆర్‌ఎస్ పార్టీకి దక్కింది.

అలా భువనగిరి పార్లమెంట్ బి‌ఆర్‌ఎస్ చేతుల్లోకి వెళ్లింది. కానీ ఈ సారి ఎన్నికల్లో అక్కడ బి‌ఆర్‌ఎస్ గెలుపు ఈజీ కాదని తెలుస్తోంది. బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ షాక్ ఇచ్చేలా ఉంది. మునుగోడులో బి‌ఆర్‌ఎస్ పార్టీకి బి‌జే‌పి పోటీ ఇస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ సారి భువనగిరిలో కారుకు షాక్ తగిలేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version