కన్నడ స్టార్ హీరోలు కేజీయఫ్ ఫేం యశ్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలిశారు. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన నేడు బెంగళూరు శివారులోని యలహంకలో మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం భారత వైమానిక దళం ప్రదర్శించిన విన్యాసాలను ఆయన ఆసక్తిగా తిలకించారు.
అనంతరం మోదీ.. కన్నడకు చెందిన సినీ ప్రముఖులను కలుసుకున్నారు. వీరిలో హీరో యశ్, కాంతార హీరో రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫొటోలను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
కాంతార సినిమా తనకు ఎంతో బాగా నచ్చిందని మోదీ రిషబ్ తో చెప్పినట్లు సమాచారం. ఇక రాఖీ భాయ్ యాక్షన్ మామూలుగా లేదంటూ కితాబిచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ భారత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచిందని మోదీ ప్రశంసించినట్లు
కాగా, ‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ప్రారంభించేందుకు ప్రధాని ఆదివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రారంభించిన మోదీ.. ఈ ఏరో ఇండియా ప్రదర్శన భారత్ సామర్థ్యాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. విదేశాలకు రక్షణ రంగ సామగ్రి ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిందని ఆయన అన్నారు.</p>