కేటీఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం : ఎంపీ చామల కిరణ్

-

గత 10 ఏళ్లుగా పనికిరాని రాజకీయం చేసిర్రు పనికిరాని పాలన చేసిరు. కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైంది అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ అన్నారు. అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కాములు బయటకు రాబోతున్నాయి. కేటీఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం. 2014,2018 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మీరు చేసింది గుండు సున్నా KTR అని ఎంపీ పేర్కొన్నారు.

అలాగే 20% కూడా మీరు చేయలేదు, అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది మాట్లాడుతున్నావు. మీరు 10 సంవత్సరాలలో రైతుల కోసం 84 కోట్లు ఖర్చు చేస్తే మేము ఒక్క సంవత్సరంలోనే సుమారుగా 50వేలకు కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేశాం. 24 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లు రైతుల కోసం రుణమాఫీ చేశాం. సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని మేము చెప్పినం రోడ్లకు,రియల్ ఎస్టేట్ వెంచర్లకు,గుట్టలకు ఇవ్వము. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయుము మీరు చేసినట్టు. ఓ పక్క నువ్వు హెచ్ఎండిఏ నిధులుని దోస్తుల కోసం ఖర్చు చేశావు అని ఎంపీ చామల కిరణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version