ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాబోయే నాలుగు రోజులపాటు అత్యంత ప్రమాదకరమైన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం అలాగే ద్రోని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. మరికొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకరమైన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.

ముఖ్యంగా కోనసీమ ఉభయగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు కాకినాడ అల్లూరి ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలిపింది.
ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా.. ఇవాల్టి నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ వాతావరణ శాఖ. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మరో నాలుగు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాదులో కూడా భారీ వర్షాలు ఉంటాయట.