ASIA CUP 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ దుబాయ్ లో జరుగగా… పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది సూర్య కుమార్ యాదవ్ టీం.

తొలుత 127/9 పరుగులు చేసింది పాకిస్థాన్. అయితే.. 128 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది భారత్. ఓపెనర్ అభిషేక్ శర్మ(13 బంతుల్లో 31), సూర్య కుమార్ యాదవ్(47*), తిలక్ వర్మ(31) అద్భుతంగా రాణించారు. ఈ దెబ్బకు 15.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది ఇండియా.