RRR : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుండి బిగ్ అనౌన్స్ మెంట్

-

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్… సినిమా కోసం ఆటో మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు టాప్ హీరోలు ఈ సినిమా చేయడంతో… భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ నుంచి ఏ చిన్న విషయం లీకైన.. అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ లు రికార్డులను తిరగ రాస్తున్నాయి.

అయితే.. తాజాగా ఈ సినిమాలో మరో అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన వీడియో థీమ్‌ సాంగ్‌ ను భారత దేశంలోని ఐదు భాషలకు చెందిన ఐదుగురు ప్రఖ్యాత సింగర్స్‌ పాడారని… దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవాళ 11 గంటల సమయంలో అధికారికంగా వెల్లడిస్తామని… ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం బృందం కాసేపటి క్రితమే.. తమ ట్విట్టర్‌ వేదికంగా పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్ చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీం. దీంతో ఆ సాంగ్‌ కోసం యావత్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌, ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూడటం మొదలు పెట్టారు. కాగా.. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌ 13న రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version