ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ లో చేరితే ఏడాదికి లక్ష రూపాయలు పొందొచ్చు..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. అయితే కేంద్రం అందించే స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి వయ వందన యోజన Pradhan Mantri Vaya Vandana Yojana స్కీమ్ కూడా ఒకటి. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఈ పథకాన్ని అందిస్తోంది.

 

డబ్బులు

మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే డబ్బులు కూడా మారతాయి. ఈ స్కీమ్ వలన మంచి లాభాలు కలుగుతాయి. ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

స్కీమ్ లో కనుక జాయిన్ అయితే చక్కటి బెనిఫిట్స్ మనకి ఉంటాయి. అయితే 60 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి మాత్రమే వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు రావడం జరిగింది.

రూ.15 లక్షల వరకు ఎంత అయినా కూడా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఈ స్కీమ్ కోసం పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ వంటి డాక్యుమెంట్లు అందిస్తే సరిపోతుంది. 3 ఏళ్ల తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్ కాల పరిమితి 10 ఏళ్లు.

ఈ స్కీమ్ తో ఏడాదికి పెన్షన్ రూపంలో రూ.1.11 లక్షలు పొందొచ్చు. ఈ పథకం 2023 మర్చి వరకు అందుబాటులో ఉంటుంది. ఇక ఎలా డబ్బులు వస్తాయి అనేది చూస్తే.. నెలకు కనీసం రూ.1000 పెన్షన్ తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.9250 పొందొచ్చు. దీనికి రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఏడాదికి రూ.1.11 లక్షలు వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version