బిగ్ బాస్ 4 : నేడు ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యేది వీరే !

-

బిగ్ బాస్ 4 విజయవంతంగా నాలుగో వీక్ కి వచ్చేసింది. నాలుగో వారం నామినేషన్స్ కూడా ఈరోజు జరగనున్నాయి. సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్‌ లో నామినేషన్స్ వేడి మామూలుగా ఉండదు. ఇక ఈరోజు కూడా నామినేషన్ ప్రక్రియ గట్టిగానే సాగింది. ఇక ఈరోజు ఎవెరెవరు అయితే నామినేట్ అయ్యారో వారి వివరాలు ముందే బయటకి వచ్చాయి. ఆ పేర్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

ఈ రోజు అభిజీత్, కుమార్ సాయి, హారికా, మెహబూబ్, సోహైల్, స్వాతి దీక్షిత్, లాస్యలు నామినేట్ కానున్నారు. వీరి కోసం ఈ వారం అంతా వోటింగ్ జరగనుంది. ఆ వోటింగ్ మేరకు అందరిలో ఎవరికి అయితే అతి తక్కువ వోట్లు వస్తాయో వారిని ఎలిమినేట్ చేయనున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే మూడు వారాల్లో వరుసగా సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవీ నాగవల్లిలి ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version