వ్యాపారం సరిగా నడవట్లేదని ప్రత్యర్థి దుకాణానికి నిప్పు..

-

రోజురోజుకూ కొందరు వ్యక్తులు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎదుటివారు బాగుపడుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. అంతటితో ఆగకుండా వారిని ఎలాగైనా నాశనం చేయాలని కుయుక్తులు పన్నుతున్నారు. వ్యక్తి గతంగా టార్గెట్ చేయడంతో పాటు వారి జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో వెలుగుచూసింది.

తన వ్యాపారం బాగా నడుస్తలేదని ఎదురుగా ఉన్న వ్యాపారస్తుని దుకాణానికి ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటన చొప్పదండి మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కోడూరి శ్రీనివాస్, గాలిపేల్లి కనకయ్య అనే ఇద్దరు వ్యక్తుల వస్త్ర దుకాణాలు ఎదురెదురుగా ఉంటాయి. కోడూరి శ్రీనివాస్ వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో తీవ్ర అప్పులు పాలయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన అతను గాలిపెల్లి కనకయ్య దుకాణాలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో అతనికి కూడా మంటలు అంటుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version