Big Boss 5 : ఈ వారం నామినేషన్ లో ఉంది వీరే..!

-

బిగ్ బాస్ సీజ‌న్ 5 మొద‌లైన రెండో రోజో నామినేషన్ ప్ర‌క్రియ ప్రారంభమైంది. ఇక ఈ నామినేష‌న్ ప్ర‌క్రియ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. ఫ‌స్ట్ వీక్ నామినేష‌న్స్ గొడ‌వలు..ఏడుపుల మ‌ధ్య సాగింది. ఇక ఈ వారం నామినేష‌న్ లో ఆర్ జే కాజ‌ల్, యాంక‌ర్ ర‌వి, మాన‌స్, స‌ర‌యు, హ‌మిదా, జెస్సీ ఉన్నారు. ఇక నామినేష‌న్ లో జెస్సీ కోపంతో భాగా ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌న‌ను నామినేట్ చేయ‌గానే ఏడ‌వ‌టం మొద‌టు పెట్టాడు.

హ‌మీదా కూడా చాలా ఎమోష‌నల్ అయ్యి ఏడ్చేసింది. ఇక ఈ వారం ఇంటి నుండి వెళ్లేది వీళ్లేనేమో అంటూ అప్పుడే అంచ‌నాలు కూడా మొద‌లయ్యాయి. హ‌మీదా లేదా జెస్సీ ఈ వారం ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ‌తార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఈ వారం ఎవ‌రుంటారో…హౌస్ నుండి ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version