BIG BOSS 6 : త్వ‌ర‌లో ‘బిగ్‌బాస్’ షురూ.. అరియానా రీ-ఎంట్రీ?

-

బిగ్ బాస్ షో కు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా క్రేజ్ ఉంది. ఇప్పటికే పూర్తయిన బిగ్ బాస్ ఐదు సీజన్లు చాలా విజయవంతంగా నడిచాయి. ఈసారి ఓటీటీ ద్వారా బిగ్ బాస్… ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ఇప్పటికే నాగార్జున ప్రకటించారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి హాట్ స్టార్ లో బిగ్ బాస్ షో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి… వివరాలు లీకయ్యాయి. గతంలో బిగ్ బాస్ లో అలరించిన వారిని కూడా ఈసారి మళ్లీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ కంటెస్టెంట్ లను తీసుకున్నారని సమాచారం. వారిలో హర్యానా కూడా ఉందని తెలుస్తోంది. ఆమెతో పాటు మాజీ కంటెస్టెంట్ లు ఆదర్శ్, తనిష్, అలీ రెజా, హరితేజ, అఖిల్ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు టిక్ టాక్ స్టార్ దుర్గారావు, డి టెన్ విజేత రాజు, యాంకర్ వర్షిని ఇలా చాలా మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version