ప్రధాని మోదీని ఉద్దేశించి కేటీఆర్ సంచలన ట్వీట్ !

-

రేపటి నుంచి పార్ల మెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా ఈ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. రేపటి (జనవరి 31) నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరో సారి గుర్తు చేయాలని.. తాను ట్వీట్ చేస్తున్నట్లు తెలిపారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు అని… ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారని కేటీఆర్ ప్రస్తావించారు. అలాగే ఇంటింటికీ నీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. హామీలకు న్యాయం చేసేలా బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version