Big Boss OTT Telugu: మందు తాగి చిందేసిన శివ.. ‘బిగ్ బాస్’ హౌజ్‌లో రచ్చరచ్చ..

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ.. గత సీజన్స్ కంటే చాలా భిన్నంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ బిహేవియర్, టాస్కులు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఫన్నీ టాస్క్ లో భాగంగా ‘బిగ్ బాస్’ ఈసారి వెరీ డిఫరెంట్ టాస్క్ ఇచ్చినట్లు తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. సదరు ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

ఈ ఫన్నీ టాస్క్ ఏంటంటే.. ‘బిగ్ బాస్’ ఇంటి సభ్యులు అందరూ కుటుంబ సభ్యులుగా మారిపోవాలి. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక స్కిట్ చేయాలి. సదరు ఇంటికి ఇంటి పెద్దగా నటరాజ్ మాస్టర్ వ్యవహరించినట్లు ప్రోమో ద్వారా తెలుస్తుంది. ఇక ఇంటి పెద్దకు భార్యగా ముమైత్ ఖాన్ వెళ్లినట్లుంది. అయితే, ఈ స్కిట్ లో శివ అతిగా ప్రవర్తించినట్లు కనబడుతోంది.

నటరాజ్ మాస్టర్ లుంగీని పదే పదే గుంజుతూ మందుబాబు అవతారమెత్తాడు. బ్యాక్ గ్రౌండ్ లో ‘మందు బాబులం.. మేము మందు బాబులం’ అనే కోట శ్రీనివాస రావు పాట ప్లే అవుతూనే ఉంది. దాంతో శివ మరింత రెచ్చిపోయాడు. ఇక ముమైత్ ఖాన్ ను ఉద్దేశించి కంటెస్టెంట్స్ ఈయన నీకు ఏం చేశాడు? అని అడగ్గా.. నటరాజ్ మాస్టర్ వైపు చూసి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడింది ముమైత్.

‘డాంగ్..డాంగ్’ అని అంది. ఇంతలోనే శివ రచ్చరచ్చ చేయడం స్టార్ట్ చేశాడు. లుంగీ గుంజడం, కప్పుకోవడం చేస్తూనే.. ఉండగా దిక్కుమాలినోడు అంటూ నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యారు. ఇక అషురెడ్డిని కౌగిలించుకోవడంతో పాటు ఆమె ఒళ్లో పడుకున్నాడు శివ. నీకు మందు ఎక్కువైందంటూ అషురెడ్డి అంది. ఇంతలోనే టాస్కు పూర్తయిందని తెలపగా, లెగరా అని శివపై అషురెడ్డి అరిచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version