Big Boss OTT Telugu: రసవత్తరంగా గేమ్..టైటిల్ కోసం కంటెస్టెంట్స్ వ్యూహాలు

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ పదో వారంలోకి ఎంటరయింది. కంటెస్టెంట్స్ అందరూ తమ గేమ్ పైనే ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇంత దూరం వచ్చాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎలిమినేట్ కాకూడదనే అనుకుంటున్నారు హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్. అలా గేమ్ చాలా రసవత్తరంగా మారుతోంది.

బిగ్ బాస్ ఇంటికి గెస్టులుగా మానస్, సిరి హన్మంత్..లు వచ్చారు. అయితే, వచ్చిన గెస్టులలో చాలా మంది బిందు మాధవికి సపోర్ట్ చేస్తుండటం గమనార్హం. ఇంటిలో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తమ గేమ్ పైన ఫుల్ ఫోకస్ పెడుతుండటంతో పాటు గెస్టులుగా వచ్చిన వారి నుంచి తమ గేమ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, మొదటి నుంచి బిందు మాధవి తన గేమ్ పైన ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటోందని బీబీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఇక ఇంటిలో ఫ్రెండ్స్ గా బిందు మాధవి, శివ..కొనసాగు..తున్నారు. బుధవారం ఎపిసోడ్ లో నూ బిందు మాధవి తనదైన స్టైల్ లో గేమ్ ఆడింది.

సోషల్ మీడియాలో బిందు మాధవిని ఎలిమినేట్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయం తెలుసుకుందో ఏమో తెలియదు. కానీ, బిందు మాధవి తన గేమ్ పైన ఫుల్ ఫోకస్ పెడుతోంది. సోమవారం ఎపిసోడ్ లో బిందు అతిగా , దారుణంగా ప్రవర్తించిందిన కొందరు కామెంట్స్ చేశారు. కాగా, ఈ విషయాలు బిందు మాధవిని టాప్ ఫైవ్ లో ఉండకుండా చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ, బిందు మాధవి మాత్రం తన గేమ్ పైనే ఫుల్ ఫోకస్ పెడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version