త్వరలో కరోన విజృంభన.. ఇజ్రాయిల్ పరిశోధనలో షాకింగ్ విషయాలు

-

చైనాలో వూహాన్ నగరంలో రెండేళ్ల క్రితం కరోనా మహహ్మారి మొదలైంది. చైనాలో మొదలైన కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. తన రూపాలను మార్చుకుంటూ ప్రజలపై దండెత్తుతోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తరుచూ రూపాలు మార్చుకుని కొత్తకొత్త వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా అతలాకుతలం చేసింది. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది.

ఇదెలా ఉంటే కరోనా తీవ్రత తగ్గిందనుకుంటున్న సందర్భంలో ఇజ్రాయిల్ పరిశోధలకు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడిప్పుడే తగ్గిందని భావిస్తున్న కరోనా త్వరలోనే మరోసారి విజృంభిస్తుందని పరిశోధనల్లో తేలింది. డెల్టా లేదా కొత్త వేరియంట్ ఇందుకు కారణం కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డెల్టా వేరియంట్ అంతకు ముందున్న కరోనా వేరియంట్లను అంతం చేయగా… ఓమిక్రాన్ మాత్రం డెల్టాను ఏం చేయలేకపోయిందని తెలిపారు. త్వరలో ఓమిక్రాన్ అంతమైనా.. డెల్టా వేరియంట్ మాత్రం తన వ్యాప్తిని కొనసాగిస్తూనే ఉంటుందని.. మరింత శక్తివంతంగా తయారుకావచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version