తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు.ప్రస్తుతం ఈ వారంలో హౌస్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఒక్కరొక్కరిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. దానితో చాలా పుటేజ్ మొత్తం ఏడుపు, ఎమోషన్ తో నిండి పోయింది.
ఇంటి సభ్యులందరి ముందు ఆదిరెడ్డి కోరుకున్నట్లుగానే అతని పాప బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఇది చూసి సింగర్ రేవంత్ తన రీసెంట్ గా పుట్టిన తన కూతురు గుర్తుకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. కవిత కూడా రేవంత్ ను మీకు పండంటి బిడ్డ పుడుతుందని చెప్పి ఓదార్చింది. ఇక హౌస్ లో అందరూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.
తాజాగా రేవంత్ భార్య అన్విత షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నువ్వు లేకపోవడం వల్ల.. నా లైఫ్‌లో స్ట్రెంత్, స్మైల్, సంతోషం, ఛార్మ్ అన్ని పోయాయి.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను.. ఇలాంటప్పుడు నువ్వు నా పక్కన ఉంటే బాగుండేది.. నాకు నువ్వు మాత్రమే అవసరం.. కేవలం నువ్వు మాత్రమే.. నువ్వు మాత్ర మే కావాలి.. నీకోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ రేవంత్ భార్య అన్విత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ తన వాళ్లను చూసుకొనే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.