బిగ్ బాస్ తొండి ఆట ఆడుతున్నాడు..!!

-

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు.ఇంకో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది. ఇంట్లో 8 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు.టికెట్ టు ఫినాలే కోసం బిగ్ బాస్ వివిధ రకాల టాస్కులు చేపిస్తున్నాడు.

దీని కోసం అందరూ ప్రాణం పెట్టి మరీ ఆడుతున్నారు.వాస్తవానికి గత సీజన్లో ఎలిమినేట్ అయిన వారు, ప్రస్తుత సీజన్లో ఎలిమినేట్ అయిన వాళ్ళలో చాలా మంది చెప్పేది ఒక్కటే విషయం ఉంటుంది. అదేమిటంటే మేము హౌజ్ లో వున్నప్పుడు చేసిన వన్నీ చూపించరు, కేవలం బిగ్ బాస్ షో వారు ఏమి కావాలని అనుకుంటారో అది మాత్రమే చూపిస్తారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటుంది అంటూ ఆరోపణ చేస్తూ ఉంటారు.

అలాగే బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్ కూడా ఎప్పుడూ సీక్రెట్ గా ఉంచుతారు, దానిని అలాగే ఉంచి తాను అనుకున్న వారిని ఎలిమినేట్ చేస్తారని అంటూ ఉంటారు. ఇక బిగ్ బాస్ షోలో ఈ వారంలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి గత వారం ఎలిమినేషన్ జోన్లో చివరి దాకా ఉన్న పైమా ఈ వారంలో హౌస్ లోంచి వెళ్లి పోవచ్చని టాక్ నడుస్తోంది. కాని బిగ్ బాస్ మాత్రం తనని కాకుండా రోహిత్ ను టార్గెట్ చేసి బయటకి పంపిస్తున్నాడట. దీనితో రోహిత్ ప్యాన్స్ ఇదంతా తొండి ఆట అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news