ఈ రోజు లక్నో వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ మరియు నెదర్లాండ్ లు తలపడగా, అన్ని విభాగాలలో పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచిన హాసమాధుల్లా షాహిద్ టీం ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించి సెమీస్ కు ఇంకా ఆశలు పెంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ ఆఫ్గనిస్తాన్ ముందు స్వల్ప లక్ష్యాన్ని 180 ఉంచింది. నబి 3 మరియు నూర్ అహ్మద్ 2 వికెట్లు చెలరేగి బౌలింగ్ చేయడంతో పరుగులకే కుప్పకూలింది నెదర్లాండ్. అనంతరం ఆఫ్గనిస్తాన్ 31.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆఫ్ఘన్ బ్యాటింగ్ లో రహ్మత్ షా (52) మరియు హస్మతుల్లా షాహిద్ (56) లు అర్ద సెంచరీ లు చేసి విజయాన్ని అందించారు. ఈ విజయంతో వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ వరుసగా మూడు మ్యాచ్ లలో గెలిచింది. ఈ గెలుపుతో ఆఫ్గనిస్తాన్ మరొక విజయం సాధిస్తే సెమీస్ కు చేరుకునే అవకాశాలను పటిష్టం చేసుకుంది.
ఆఫ్ఘన్ ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఇంగ్లాండ్, శ్రీలంక, నెదర్లాండ్ మరియు పాకిస్తాన్ లను ఓడించాయి. ఇక మిగిలి ఉన్న రెండు మ్యాచ్ లలో సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా లను ఢీ కొట్టనున్నాయి.