హీరోయిన్ మృణాళిని ఠాకూర్ పెళ్లి పై రూమర్స్ !

-

సోషల్ మీడియా ఎప్పుడైతే బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందో ? అప్పటి నుండి నిజం అబద్దం అన్న తేడా లేకుండా రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొందరు మాత్రం కేవలం వాస్తవాలను ప్రచారం చేస్తుంటే, చాలా మంది బాగా ఫేమస్ అయిన వారిని వివిధ రకాలుగా పోస్ట్ లే పెట్టి ట్రోల్ చేస్తున్నారు. తాజాగా మరాఠీ హీరోయిన్ మృణాళిని ఠాకూర్ కు సంబంధించిన పెళ్లి వార్త షికార్లు కొడుతోంది. సీతారామం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మృణాళిని ఠాకూర్ సీత గా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. మృణాళిని ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోనుందన్న వార్తలు రావడంతో , ఈమె బంధువులు మరియు స్నేహితులు ఏంటి నువ్వు తెలుగుఅబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా అని అడగడంతో షాక్ అయిన మృణాళిని ఠాకూర్.. ఈ వార్తలను ప్రచారం చేస్తున్నవారిపై ఫన్నీ గా రియాక్ట్ అయింది.

ఈ ఫన్నీ విషయం గురించి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదని చెబుతూనే.. ఒక పని చేయండి, అబ్బాయిని మీరే వెతికి పెట్టండి ? పెళ్లి వేదికను కూడా నాకు లొకేషన్ షేర్ చేయండి అంటూ సెటైరికల్ గా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version