కరోనా వైరస్ ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వైద్య సంస్థలను కలెక్టర్ల పరిధిలోకి తీసుకువస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇక నుంచి వాటిని ప్రభుత్వం అవసరం అయితే వాడుకోనుంది. వాటి నిర్వహణ జిల్లా కలెక్టర్లు చూసుకుంటారు. జాతీయ విపత్తు కాబట్టి వాటిని వాడుకోనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు, మెడికల్, నాన్ మెడికల్ స్టాఫ్ ని కూడా ప్రభుత్వం వాడుకోనుంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో కరోనా కేసులు నేడు మరో రెండు పెరిగాయి. కాకినాడ, రాజమండ్రిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాలో మూడు చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్లకు కరోనా పాజిటివ్ గా ఏపీ లో తేలింది. దీనితో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.
ఎక్కడిక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా సరే కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే రోజు కేసులు బయటపడటం తో ఇప్పుడు జగన్ సర్కార్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రతీ ఇంటికి వైద్య బృందాలను పంపాలని భావిస్తుంది. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్య౦ చెల్లించే అవకాశాలు ఉన్నాయి.