రాజకీయాలలో ఎవరికీ రాని కష్టాలు, ఎదురుదెబ్బలు వైయస్ జగన్ తింటున్నారు. 2009వ సంవత్సరంలో ఎంపీగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ ఆ టైంలో తండ్రి వైఎస్ఆర్ ని కోల్పోయారు. కన్న తండ్రిని కోల్పోయిన వై.ఎస్.జగన్ ని రాజకీయంగా తొక్కేయాలని అనేక ప్రయత్నాలు అప్పట్లో ఢిల్లీ నుండి రాష్ట్ర స్థాయి లో ఉన్నప్రత్యర్థులు వైయస్ జగన్ ని అనేక ఇబ్బందులు పెట్టారు. జైల్లో పెట్టారు అక్రమ కేసులు బనాయించారు అయినా ఎక్కడ బెదరకుండా వైసిపి పార్టీని స్థాపించి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు కష్టాలు పడి ఎట్టకేలకు 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇళ్ల పట్టాల కార్యక్రమం వాయిదా పడింది. ఆ టైంలో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు ఇళ్ల పట్టాలు ఇద్దామని భావించారు. అయితే కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశమంతటా షట్ డౌన్ ప్రకటించడంతో, 21 రోజులపాటు దేశ ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు ఇవ్వడంతో…ఇళ్ల పట్టాల కార్యక్రమం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితుల బట్టి చూస్తే జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం ఇప్పుడప్పుడే లేనట్టే అన్న టాక్ బలంగా వినబడుతోంది. ఈ విషయం గురించి ఇటీవల పార్టీలో కేంద్ర పరిధిలో పనిచేసే సీనియర్ నాయకులతో జగన్ చర్చించిన టైంలో, వాళ్లు కూడా అబ్బే కష్టం జగన్ గారూ .. ఇప్పట్లో మీకు ఆ గుడ్ న్యూస్ లేనట్టే…ఈ లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఎక్కువగా ఉన్నాయని అంటున్నారట.