బిగ్ బ్రేకింగ్ : షూటింగ్ ఆపేసి చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్తున్న చిరంజీవి!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి తను పాల్గొంటున్న షూటింగ్ మధ్యలోనే ఆపేసి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన పీఎస్‌కు బయలుదేరగా..అక్కడ ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయం తెలిస్తే అటు మెగా అభిమానులు సైతం వేలాదిగా చేరుకునే అవకాశం ఉంది.

దీంతో అక్కడి పరిసరాలు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, చిరంజీవిని స్టేషన్ పరిసరాలకు రాకుండా పోలీసులు అడ్డుకునే ఆస్కారం లేకపోలేదు. ట్రాఫిక్, అభిమానుల రద్దీ దృష్ట్యా ముందే ఆయనతో పోలీసులు మాట్లాడతారని తెలుస్తోంది.ఇదిలాఉండగా, మొన్నటివరకు బన్నీ, మెగాఫ్యామిలీ మధ్య గొడవలు జరుగుతున్నాయని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. చిరంజీవి ఒకవేళ పీఎస్‌కు బన్నీ కోసం వెళ్లినట్లు తెలిస్తే ఈ రూమర్లకు ఇకపై చెక్ పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news