బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ తల్లి విగ్రహానికి తుది మెరుగులపై సీఎం సూచనలు

-

సీఎం రేవంత్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దీక్షా దివస్ రోజునే తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పలు మార్పులు, సూచన చేశారు. నాయకులకు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్ పేట వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు.

విగ్రహ శిల్పితో మాట్లాడిన ఆయ‌న.. తుది మెరుగులపై పలు సూచనలు చేశారు. ఫైన‌ల్ అయ్యాక విగ్ర‌హాన్ని సెక్ర‌టేరియ‌ట్ ఎదుట ప్ర‌తిష్టించ‌నున్నారు. ఇప్ప‌టికే అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మిగ‌తా పనులు సైతం కొన‌సాగుతున్నాయి. ఇదిలాఉండగా, తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ మార్పుల‌ను ప్ర‌తిపక్ష బీఆర్ ఎస్ నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version