భారత్-పాకిస్తాన్ నడుమ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ప్రాదేశిక సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకు ఆహ్వానం పలికింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
18 ఏళ్ల నుంచి 42 ఏళ్లలోపు వారికి అవకాశం కల్పించనున్నట్లు ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే, ఇందుకు విద్యార్హతను డిగ్రీగగా నిర్దారించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఆదాయం కలిగి ఉన్నవారికి సైతం ఇందులో ప్రాధాన్యత కల్పిస్తామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇదిలాఉండగా, పాక్ తో యుద్ధం నేపథ్యంలో టెరిటోరియల్ ఆర్మీలోని 14 బెటాయిన్లను సైతం ఆర్మీ రంగంలోకి దించుతున్న విషయం తెలిసిందే.