భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ చెప్పేవి అన్నీ పచ్చి అబద్ధాలు, తప్పుడు ప్రచారం. వాటిని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. పాకిస్తాన్ డ్రోన్ దాడులకు ధీటుగా భారత్ స్పందిస్తోందని వెల్లడించారు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.

భారత్ ఇప్పటికి యుద్ధం కోరుకోవడం లేదు, మేము ఈ ఉద్రిక్తతలను పెంచాలని అనుకోవడం లేదు, పాకిస్తాన్ చేసే దాడులకు మాత్రమే భారత్ స్పందిస్తోందన్నారు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. పాకిస్తాన్ ఈ రోజు ఉదయం కూడా దాడులు చేసింది.. పాక్ సైన్యం సామాన్య ప్రజలను, వారి ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తుందని ఫైర్ అయ్యారు.. పాక్ దాడులకు భారత సైన్యం గట్టిగా జవాబు ఇస్తుందన్నారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.