బిగ్ బ్రేకింగ్ : మహాత్మా గాంధీ యూనివర్సిటీకి తాళాలు, భారీగా పోలీసుల పహారా

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం నల్గొండలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, రైతు భరోసా ఇవ్వడం లేదని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నల్లొండ జిల్లాలో రైతు మహాధర్నా కార్యక్రమం తలపెట్టింది. ఈ క్రమంలోనే క్లాక్ టవర్ వద్ద మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

అయితే,ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు కేటీఆర్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 2గంటల తర్వాత యూనివర్సిటీకి వస్తానని కేటీఆర్ వారికి హామీ ఇవ్వడంతో ఆగమేఘాల మీద యూనివర్సిటీ గేట్లకు అధికారులు తాళాలు వేశారు. విద్యార్థులను బయటకు రానివ్వకుండా చేశారు. అంతేకాకుండా భారీగా పోలీసుల పహారా ఏర్పాటు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version