బ్రేకింగ్; మూడు రాజధానులపై స్పందించిన మోడీ…!

-

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందిస్తారు అనేది చాలా రోజులుగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా ఏపీ లో ఈ అంశం దాదాపు మూడు నెలల నుంచి తీవ్ర దుమారం రేపుతుంది. రైతులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర స్పందించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

అయినా సరే కేంద్రం నుంచి మాత్రం ఏ స్పందనా ఉండటం లేదు. పార్లమెంట్ లో మాత్రం తమకు సంబంధం లేని అంశం అని చెప్పింది కేంద్రం. 2015 లో అమరావతిని రాజధానిగా ప్రకటించారు అని చెప్పింది. దీనిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని ఇక్కడి రాజకీయ పార్టీలు కోరుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై స్పందించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రధాని మోదీకి ఒక లేఖ రాశారు. ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

13 జిల్లాలు ఉన్న ఏపీ రాష్ట్రానికి 3 రాజధానులను అంగీకరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనిఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చూడాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేసారు. లేఖపై స్పందించిన మోడీ… ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై రాసిన లేఖ తనకు అందిందని, దాన్ని పరిశీలిస్తున్నామని టీడీపీ ఎంపీకి తెలిపారు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న మోడీ ఇప్పుడు స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version