చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. ఆ స్కీమ్స్ ద్వారా మంచిగా ఆదాయాన్ని పొందుతూ వుంటారు. అయితే కేంద్రం చాలా రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి కూడా వస్తుంది.
ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో చాలా మంది డబ్బులని ఇన్వెస్ట్ చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టేవారి కోసం భారత ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ని తీసుకు రావడం జరిగింది. అత్యంత ప్రజాదరణ పొందిన భారత ప్రభుత్వం అందించే స్కీమ్స్ లో ఒకటి. ఈ స్కీమ్ లో భారత పౌరులు ఎవరైనా సరే చేరచ్చు.
సంవత్సరానికి రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు, వరసగా 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ తరవాత డబ్బు అవసరం లేకపోతే స్కీమ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అకౌంట్ మెచూరిటీని పొడిగించుకునే సదుపాయం ఉంది. కావాలంటే అకౌంట్ ఓపెన్ చేసిన సంవత్సరాన్ని మినహాయించి ఐదు సంవత్సరాల తర్వాత డబ్బులు తీసుకోచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ పూర్తయిన తర్వాత అకౌంట్‌ను కొనసాగించవచ్చు. ఆ మొత్తంపై వడ్డీ వస్తుంది. ఇక వడ్డీ విషయానికి వస్తే.. చిన్న పొదుపు పథకాలలో అత్యధికంగా సంవత్సరానికి 7.1 శాతం వడ్డీని అందిస్తోంది కేంద్రం.