బిగ్ బాస్ 6: అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్స్ వీరే..!

-

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఆరవ సీజన్ చాలా గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4వ తేదీన స్టార్ మా చానల్లో సాయంత్రం 6:00 కు ఈ కార్యక్రమం మొదలయింది. ఈ కార్యక్రమానికి నాగర్జున హోస్ట్ గా పనిచేయనున్నారు. ఇక ఈసారి వినూత్నంగా ఆలోచించి ఏకంగా 21 మందిని హౌస్ మేట్స్ గా తీసుకొచ్చింది బిగ్ బాస్ . ఇకపోతే ఈ హౌస్ కంటెస్టెంట్లు అందరూ కూడా తమ షో లను, సీరియల్స్ ను కూడా వదులుకొని బిగ్ బాస్ లోకి రావడానికి కారణం పారితోషకమని తెలుస్తోంది. రికార్డ్ స్థాయిలో భారీగా పారితోషకం ఇవ్వడానికి ముందుకు వచ్చింది బిగ్ బాస్.

ఇందులో కంటెస్టెంట్లకు వారానికి లక్ష రూపాయలు మొదలుకొని గరిష్టంగా నాలుగు లక్షల రూపాయల వరకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్లలో ఎవరు 4 లక్షల రూపాయల పారితోషకాన్ని తీసుకుంటూ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్లుగా నిలిచారో వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..ఆరోహీ రావు, ఇనయా సుల్తానా వారానికి లక్ష రూపాయల పారితోషకం తీసుకుంటున్నారు. ఇక రాజశేఖర్, అభినయశ్రీ, సుదీప వారానికి రూ. 1.50 లక్షల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం . గలాటా గీతూ వారానికి రూ.1,75,000 తీసుకుంటున్నట్లు సమాచారం. వాసంతి కృష్ణన్, ఫైమా , సాల్మన్ , శ్రీ సత్య, ఆదిరెడ్డి లు వారానికి రూ.2లక్షల పారితోషికం తీసుకుంటున్నారట.

మెరీనా వారానికి రూ.2.50 లక్షలు కాగా హీరో బాల ఆదిత్య, ఆర్ జె సూర్య వారానికి రూ.3 లక్షల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. రోహిత్ వారానికి రూ.3.25 లక్షలు కాగా శ్రీహన్ రూ.3.50 లక్షలు, చలాకి చంటి, రేవంత్ రూ.4 లక్షల రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తోంది.. మొత్తంగా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చలాకి చంటి , సింగర్ రేవంత్ నాలుగు లక్షల పారితోషకం తీసుకుంటూ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version