సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి, సండ్ర లకు భారీ ఊరట

-

ఢిల్లీ : సుప్రీం కోర్టు లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్యెల్యే సండ్ర కు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు లో ఇవాళ విచారణ చెప్పిన సుప్రీం కోర్టు.. తెలంగాణ ప్రభుత్వాని కి నోటీసులు జారీ చేసింది. లిఖిత పూర్వం గా ఆగస్టు 31 వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు.

అటు సెప్టెంబరు 6 వ తేదీ కల్లా తెలంగాణ ప్రభుత్వ సమాధానానికి తిరిగి సమాధానం సమర్పించాలని రేవంత్ రెడ్డి, సండ్ర లకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీం కోర్టు లో రేవంత్ రెడ్డి , సండ్ర వేసిన పిటిషన్ల ను విచారణకు స్వీకరిస్తూనే.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ ఓటుకు నోటు కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ నెల 7 వ తేదీకి వాయుదా వేసింది సుప్రీం కోర్టు ఉన్నత న్యాయ స్థానం…

Read more RELATED
Recommended to you

Exit mobile version