ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా నైరుతి గాలులు/ పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంగానే ఏపీ లో మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు భారీ వర్షాలు ఉన్నట్లు పేర్కొంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రా లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రా లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ : ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమ లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.