వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్!

-

వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. పుంగనూరు అల్లర్ల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయనతో పాటు మరో ఐదుగురికి సైతం బెయిల్ మంజూరైంది.తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలిచ్చింది.

ఎంపీ మిథున్ రెడ్డి జులైలో పుంగనూరు పర్యటనకు వెళ్లగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన దాడుల్లో ఇద్దరు పోలీస్ సిబ్బంది సహా 12 మందికి గాయాలయ్యాయి. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప, మరికొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలపై సెక్షన్ 307 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. జులై 18న రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ ఘటనపై ఆ మరుసటి రోజు హత్యాయత్నం సహా 2 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మిథున్ రెడ్డికి బెయిల్ లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version