దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి ఖాతాదారులకు భారీ షాక్ ను ఇచ్చింది.గృహ రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.గృహ రుణాల కోసం రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. నెల రోజుల్లో ఇది మూడోసారి పెంపు. గత నెలలో హెచ్‌డిఎఫ్‌సి రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. కస్టమర్ క్రెడిట్ స్కోర్ 780 కంటే ఎక్కువ ఉంటే అతనికి కనీస వడ్డీ రేటు 7.05 శాతంగా ఉంటుంది. ఇది అంతకు ముందు 7 శాతంగా ఉంది. కొత్త రేట్లు జూన్ 1, 2022 నుండి అమలులోకి వచ్చాయి..
గత నెలలో కూడా మూడు సార్లు వడ్డీని పెంచినట్లు తెలుస్తుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలో రెపో రేటును 0.40 శాతం పెంచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్త రెపో రేటు ఇప్పుడు 4 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. రెపో రేటు పెంచిన తర్వాత అన్ని బ్యాంకులు రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)లో 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి..
ప్రస్తుతం హోమ్ లోన్ల వడ్డీ రేట్ల భారీగా పెరిగకాదు ప్(780 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు రూ. 30 లక్షల వరకు గృహ రుణాలకు కనీస వడ్డీ రేటు 7.15 శాతం, రూ.30 లక్షల నుండి రూ. 75 లక్షల వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు. 7.40 శాతం ఉంటుంది. 75 లక్షలకు పైబడిన రుణాలపై 7.50 శాతం వడ్డీ వసూలు చేస్తారు. అలాగే గృహ రుణం పొందే మహిళలకు హెచ్‌డిఎఫ్‌సి 5 బేసిస్ పాయింట్ల తగ్గింపును అందిస్తోంది..ఒక్క ఈ బ్యాంక్ మాత్రమే కాదు దాదాపు అన్నీ బ్యాంక్లు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి.