సంక్రాంతి సెలవులపై తెలంగాణ ఇంటర్ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగకు జనవరి 14 నుంచి 16 వరకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారని, అందులో జనవరి 14వ తేదీ రెండో శనివారం, 15 నాడు ఆదివారం పోతే, సెలవులు ఇచ్చింది.
కేవలం ఒకే ఒక్క రోజు అని నిరాశ చెందుతున్నారు. దూర ప్రాంతాల్లో హాస్టల్లో ఉండే తాము ఇంటికి వెళ్లి వచ్చేసరికి ప్రయాణంలోనే సెలవులు ముగుస్తాయి అంటున్నారు.
అటు సంక్రాంతి సెలవులను రాష్ట్రవ్యాప్తంగా మరోసారి మార్చింది జగన్ సర్కార్. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఉండగా, వీటిని 12 నుంచి 17వ తేదీ వరకు మార్పులు చేశారు. తాజాగా ఈనెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం, ఈనెల 19న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని పేర్కొంది.