Samsung Galaxy A14 5G: ఈ నెల 18న లాంచ్‌.. ముందే లీకైన ఫీచర్స్..!! 

-

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ సిరీస్‌లో భాగంగా సామ్‌సంగ్‌ నుంచి మరో కొత్త ఫోన్‌ లాంచ్‌ కానుంది. అదే సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ స్మార్ట్‌ ఫోన్..ఈనెల 18న ఇండియాలో ఏ సిరీస్ మొబైళ్లను విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఇందులో సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ కూడా ఉండనుంది. దీని ధర కూడా 20 వేల లోపే ఉంటుందని సమాచారం.. లీకుల ఆధారంగా ఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి..
 సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ ధర
సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ ప్రారంభ ధర రూ.16,499గా ఉంటుందని టెక్ ఔట్‍లుక్ రిపోర్ట్ వెల్లడించింది.
 ఈ మోడల్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్‍ను కలిగి ఉంటుందని పేర్కొంది.
ఇక 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.19,499గా ఉంటుందన్న సమాచారం ఈ రిపోర్ట్ ద్వారా లీకైంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ స్పెసిఫికేషన్లు..

ఈనెల 18వ మధ్యాహ్నం 12 గంటలకు సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ లాంచ్ కానుంది.
6.6 ఇంచుల ఫుల్ హెచ్‍డీ పీఎల్ఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో ఈ మొబైల్ రానుంది.
90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుందని తెలుస్తోంది.
ఎగ్జినోస్ 1330 లేదా మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది.
సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ ఫోన్‍ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో రానుందని సమాచారం.
ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్‍గా ఉండనుంది.
ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్‍యూఐ 5.0తో Samsung Galaxy A14 5G రానుంది.
మార్కెట్‌లో శాంసంగ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఇదే ధరతో ఇవే ఫీచర్స్‌తో ఫోన్ లాంచ్‌ అయితే సేల్స్‌ బానే జరుగుతాయని అంచనా..! లాంచ్‌ అయితేకానీ తెలియదు అసలు కథ ఎలా ఉంటుందో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version