విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది చనిపోగా మరికొంత మంది ఆరోగ్యం విషమంగా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇది పక్కన పెడితే ఈ వారం ఏపీలో ప్రైవేట్ ఆస్పత్రులకు కాస్త కష్ట కాలమే. ఎందుకు అంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఏ విధంగా చర్యలు ఉంటున్నాయి, ఎలాంటి రక్షణ చర్యలు అమలు చేస్తున్నారు వంటివి డ్రైవ్ నిర్వహిస్తారు.
అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటారు. కరోన విషయంలో ఎక్కువగా ఫీజులు వసూలు చేసే వారి విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది. అవసరం అయితే అనుమతులు రద్దు చేయాలి అని భావిస్తుంది. కీలక నగరాల్లో వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా డ్రైవ్ చేస్తారు. విజయవాడ ఘటనపై సిఎం జగన్ సీరియస్ గా ఉన్నారట.