ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంగన్వాడీల ఆందోళన పై కీలక నిర్ణయం తీసుకుంది ఒకపక్క సుదీర్ఘంగా సమ్మె చేయడంతో పాటు ఈరోజు చలో విజయవాడకి పిలుపునిచ్చిన నేపథ్యంలో చర్యలకి సిద్ధమైంది. విధుల్లో చేరని అంగన్వాడిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది విధుల్లో చేరని అంగన్వాడీల మీద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి సిఎస్ జోహార్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆర్డర్స్ ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు జిల్లా కలెక్టర్లు దీనిలో భాగంగా విశాఖ జిల్లాలోని అంగన్వాడీలకి షాక్ ఇచ్చారు.
కలెక్టర్ ఎస్మా ఉల్లంఘనలకి పాల్పడ్డ సిబ్బంది తొలగింపుకి చర్యలు మొదలుపెట్టారు ఈరోజు సాయంత్రం లోగా చేరకపోతే టెర్మినేషన్ లెటర్స్ ఇళ్ళకి పంపెందుకు సన్న హాలు చేస్తున్నారు. ప్రభుత్వం హెచ్చరికతో విధుల్లో చేరారు 69 మంది వర్కర్లు 42 మంది ఆయాలు. జిల్లాలో మొత్తం 752 అంగన్వాడీలు 698 ఆయాలు ఉన్నారు. 25న నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రకటించారు 26వ తేదీ నుండి సచివాలయం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.