దేశమంతా కూడా రామనామస్మరణతో మారు మోగిపోతోంది. గల్లీ నుండి ఢిల్లీ వరకు జై శ్రీరామ్ అంటూ ప్రతి ఒక్కరు కూడా పలుకుతున్నారు. నేడు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఉద్దేశం వ్యాప్తంగా పండుగ వాతావరణం వచ్చేసింది చాలా చోట్ల విద్యాసంస్థలకి కూడా సెలవు ప్రకటించారు. ప్రజలు కూడా ఇంట్లోనే కూర్చుని అయోధ్య లైవ్ ని చూస్తున్నారు ఇది ఇలా ఉంటే రాముడి మీద భక్తి చాటుకున్నాడు ఒక భక్తుడు.
హైదరాబాద్ అల్వాల్ కి చెందిన సూక్ష్మ కళాకారుడు పూనా ప్రదీప్ తన ఉడుత భక్తిని చాటుకున్నాడు. ఎంతో కష్టపడి రావి ఆకుపై శ్రీరాముని ప్రతిమలని చెక్కాడు అలానే 60 నిమిషాల్లోనే 0.030 మిల్లీగ్రాముల సూక్ష్మ బంగారపు రామ బాణాన్ని అతను తయారు చేశాడు ముత్యంపై బంగారంతో జైశ్రీరామ్ అని రాశాడు. ఇతని టాలెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఔరా అనే విధంగా ఇతని టాలెంట్ ఉంది.