నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆరే.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

-

టాలీవుడ్ హీరో నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆరే అని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈరోజు చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆర్ అన్నారు. దొంగ ఏడుపులు మాకు అవసరం లేదు. హరీష్ రావు మనసున్న మనిషిగా నిరూపించుకున్నారు.  నామీద ట్రోలింగ్ చేస్తే  రియాక్ట్ కాలేదు కేటీఆర్.

పైగా తనపై విమర్శలు చేస్తున్నారని.. ట్రోలింగ్ చేసే వారికి కేటీఆర్ మద్దతుగా నిలుస్తున్నారని  కేటీఆర్ పై కొండ సురేఖ  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది సినీ హీరోయిన్లు జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు.  హీరోయిన్ల ఫోన్  ట్యాపింగ్ చేశారు.  హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అన్నారు. ఇవాళ తొలుత తనపై ట్రోలింగ్స్ చేస్తున్న కేటీఆర్ స్పందించడం లేదని మంత్రి కొండా సురేఖ ఆరోపించగా.. అందుకు కౌంటర్ గా కేటీఆర్ దొంగ ఏడుపులు ఎందుకు అని ప్రశ్నించారు. దీంతో కొండా సురేఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినీ ప్రముఖుల పట్ల కేటీఆర్  ఎలా వ్యవహరించారో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version