మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం.. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు!

-

పశ్చిమాసియాలో భీకర యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.హెజ్బుల్లా, హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్‌ దళాలు మట్టుబెట్టడంతో ఆ దేశంపై ఇరాన్ మంగళవారం రాత్రి బాలిస్టిక్ మిస్సైల్స్‌తో దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఒకేసారి 400లకుపైగా క్షిపణులను ప్రయోగించగా..ఇరుదేశాల మధ్య తీవ్రమైన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.

దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి జర్మనీకి వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేస్తున్నట్లుగా లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ క్రమంలో జర్మనీ వెళ్లాల్సిన 217మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు.ముందస్తు సమాచారం లేకుండా ఫ్లైట్‌ను ఎలా రద్దు చేస్తారని ప్యాసింజర్స్ ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ విమానం ఇజ్రాయెల్ గగనతలం నుంచి వెళ్లాల్సి ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా సర్వీసును రద్దు చేశామని ఎయిర్‌లైన్స్ సిబ్బంది చెప్పారు.త్వరలోనే జర్నీకి సంబంధించి అప్టేడ్ ఇస్తామని లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version