షేన్ వార్న్ మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..!

-

ప్రముఖ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ శుక్రవారం నాడు గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయారు. ఈయనకి 52 సంవత్సరాలు. ఈ వార్తను షేన్ వార్న్ కు సంబంధించిన మేనేజ్మెంట్ మీడియాకు తెలియజేశారు. షేన్ వార్న్ తమ విల్లాలో కదలకుండా ఉండడంతో మెడికల్ స్టాఫ్ కు అనుమానం వచ్చి చూడగా అప్పటికే చనిపోయారు, ఈ సంఘటన కో సమూయ్ థాయిలాండ్ లో జరిగింది.

ఈ సమయంలో వారి కుటుంబం ప్రైవసీ కోరుకుంటోంది మరియు మరింత సమాచారాన్ని కొన్ని రోజుల తర్వాత చెబుతామని అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ మరణంపై థాయిలాండ్‌ పోలీసులు సంచలన నివేదికన బయట పెట్టారు. షేన్‌ వార్న్‌ టవల్, అలాగే.. ఆయన బెడ్‌ రూంలో… రక్తపు మరకలు ఉన్నాయని థాయిలాండ్‌ పోలీసులు… వెల్లడించారు. ఆయన వాంతులు చేసుకోవడం కారణంగానే ఆ రక్తపు మరకులు పడి ఉంటాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news