కొడంగల్‌లోని లగచర్ల దాడి ఘటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఏ1గా ఉండగా.. అయన అనుచరుడు సురేశ్ ఏ2గా కొనసాగుతున్నారు.అయితే, తనపై తప్పుడు కేసులు బనాయించి ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని, ఈ కేసు కొట్టివేయాలని పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా లగచర్ల ఘటన కేసుపై హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. ఈ దాడి ఘటనలో తొలిసారి కేసీఆర్ పేరును పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రస్తావనకు తెచ్చారు. దాడులు చేయడానికి మాజీ సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు ఇచ్చారని ప్రభుత్వం తరపు లాయర్ నాగేశ్వర రావు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్‌ని సైతం హైకోర్టుకు అందజేశారు. పట్నం నరేందర్ రైతులతో మాట్లాడే క్రమంలో మన వెనుక పెద్దాయన కేసీఆర్ ఉన్నారని చెబుతూ రైతులను రెచ్చగొట్టారని కోర్టుకు వివరించారు.