తెలుగు అకాడమీ కేసులో బిగ్ ట్విస్ట్… ప్రైవేటు వ్యక్తులకు టోకరా !

-

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు అకాడమీ నిధుల గోల్‌ మాల్‌ కేసులో సంచలన సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ తెలుగు అకాడమీ నిధుల గోల్‌ మాల్‌ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తెలుగు అకాడమీ డబ్బులతో పాటు ప్రైవేటు వ్యక్తుల డిపాజిట్ కూడా కొట్టేశారు నిందితులు. అకాడమీకి చెందిన 54 కోట్ల రూపాయల తో పాటు ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్లు కాటేజారు ఈ నిందితులు.

యూనియన్, బ్యాంక్ కెనరా బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రైవేట్ వ్యక్తుల డబ్బులను కొల్లగొట్టిన ముఠా.. డిపాజిట్లను నకిలీ పత్రాలతో స్వాధీనం చేసుకుంది. నకిలీ డిపాజిట్ సర్టిఫికెట్ లతో ప్రైవేటు వ్యక్తుల నగదును బదిలీ చేశారు. అకాడమీ, ప్రైవేట్ వ్యక్తుల డబ్బులను కాజేసిన మస్తాన్వలి… మస్తాన్వలి కి ఆరుగురు సహకరించినట్లు గా పోలీసుల గుర్తించారు.

ఇప్పటికీ నలుగురిని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు…. మరొక ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అకాడమీ, ప్రైవేట్ వ్యక్తుల డబ్బులను అగ్రి సీన్ బ్యాంక్ నుంచి ఏపీ కోపరేటివ్ సొసైటీ కి బదిలీ చేశాడు మస్తాన్ వలి. ఏపీ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ సహకారంతో డబ్బులు డ్రా చేసుకుంది మస్తాన్ వలీ అండ్ గ్యాంగ్. ఇక నిధుల గల్లంతు వ్యవహారంపై నివేదిక కోరింది ఏపీ ఇంటిలిజెన్స్. దీనిపై నేడు నివేదిక సమర్పించనుంది ప్రభుత్వ త్రిసభ్య కమిటీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version