బద్వేల్ ఉప ఎన్నికల బ‌రిలో బీజేపీ..?

-

బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బిజెపి భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ జనసేన నేతల మధ్య బద్వేలు ఉప ఎన్నిక‌పై చర్చలు జ‌రిగిట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఆయన సతీమణికి టికెట్ ఇవ్వటంతో పోటీ చేయబోమని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే జనసేన చేసిన ప్రకటనతో బిజెపి సందిగ్ధంలో ఉన్న‌ట్టు స‌మాచారం.

ఇక బ‌ద్వేల్ ఉప ఎన్నిల్లో పోటీకి దిగే విష‌యం పై ఈరోజు కడపలో బిజెపి ముఖ్యనేతలు సమావేశం కాబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వైసీపీ, టీడీపీలు త‌మ అభ్యర్థులను ప్ర‌క‌టించాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే భార్య‌కే టికెట్ ఇస్తున్నందున బ‌రిలోకి దిగ‌టం లేద‌ని చెప్పిన జ‌న‌సేన ఇప్పుడు మిత్ర పార్టీ బీజేపీ బ‌రిలోకి దిగితే స‌పోర్ట్ ఇస్తుందా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version