NANI : ”అంటే సుందరానికి” నుంచి అదిరిపోయే అప్డేట్‌

-

ప్రస్తుతం టాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు న్యాచురల్‌ స్టార్‌ నాని. డిసెంబర్‌ 24 వ తేదీన విడుదల అయిన… శ్యామ్‌ సింగరాయ్‌ కు కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో.. నాని క్రేజ్‌ మరింత పెరిగింది. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం నాని చేస్తున్న మరో సినిమా అంటే సుందరానికి. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో… అంటే సుందరానికి సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో కోలీవుడ్‌ నటి నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో వస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి జీరో లుక్‌ ను విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది చిత్ర బృందం. జనవరి 1 వ తేదీన సాయంత్రం 4.05 గంటలకు ఈ జీరో లుక్‌ ను విడుదల చేయబోతున్నట్లు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇక అప్డేట్‌ తో… నాని ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version