బిగ్‌బాస్ 5 హోస్ట్‌గా రానా?

-

తెలుగులో బిగ్‌బాస్ షో క్రేజే వేరు. పాత, కొత్త నటీనటులను సెలక్ట్ చేసి ఈ షో నిర్వహిస్తారు. ఇప్పటికే 4 సీజన్లు పూర్తి అయ్యాయి. కరోనా లాక్ డౌన్ ఎత్తివేయడంతో బిగ్ బాస్ షోపై నిర్వాహకులు దృష్టి సారించారు. హోస్టును వెతికే పనిలో పడ్డారు. హీరో రానా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. రానా.. ‘నెంబర్ వన్ యారి’షోతో ప్రేక్షకులను ఆకర్షించారు. ఈ షో రేటింగ్‌లో కూడా పర్వాలేదనిపించింది.

దీంతో బాస్ బాస్ షో నిర్వాహకుల కన్ను రానాపై పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని రానా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. త్వరలో తన నిర్ణయాన్ని చెబుతానని రానా చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు నాగార్జున, ఒకసారి ఎన్టీఆర్, నానికి ఒకరి హోస్ట్‌గా చేశారు. రానా అయితే కరెక్ట్ అని భావిస్తున్నారట. కంటెస్టెంట్లను కూడా సెలక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి హోస్ట్‌గా రానాను అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news