ఎత్తు ను పెంచే ఆహారపదార్ధాలు ఇవే..!

-

చాలా మందికి బాగా హైట్ గా ఉండడం ఇష్టం. అయితే తల్లిదండ్రులు కూడా మంచి ఆహారం పెట్టడం వల్ల పిల్లలు పొడుగ్గా ఎదుగుతారు అని అంటూ ఉంటారు. అయితే వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ మంచి ఎత్తుని పొందడానికి సాధ్యపడుతుంది. ఎత్తు(hight)ను పెంచే ఆహారపదార్ధాలు ఇవే…

 ఎత్తు/ hight
ఎత్తు/ hight

దీంతో పాటు ఆహారం కూడా ఎంతో ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అయితే ఈ రోజు మనం ఎత్తు ఎదగడానికి ఎటువంటి తీసుకోవడం మంచిది. వేటి వల్ల బాగా పొడుగ్గా ఎదగచ్చు అనే విషయాలు చూద్దాం.

మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. ప్రతి ఒక్కరు కూడా మంచి పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మరియు ఇతర పోషక పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. సాధారణంగా ఒక మనిషి 18 ఏళ్ల నుండి 20 ఏళ్ల మధ్య వరకు హైట్ ఎదుగుతారు. ఆ తర్వాత హైట్ ఎదగడం ఉండదు. కాబట్టి ఆ ముందే మంచి పోషకాహారం తీసుకోవాలి.

అయితే ఈ ఐదు ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల బాగా హైట్ ఎదగచ్చు అని నిపుణులు అంటున్నారు. వీటిని తినడం వల్ల బోన్ డెన్సిటీ బాగుంటుందని.. ఎత్తు ఎదుగుతారని చెబుతున్నారు. ఆ ఆహార పదార్థాల గురించి చూస్తే..

బీన్స్:

బీన్స్ లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది హైట్ ని పెంచుతుంది. ఇది మాత్రమే కాకుండా ఫోలేట్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవడం వల్ల హైట్ ఎదగచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

చికెన్:

చికెన్ లో కూడా ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది మజిల్స్ ని బాగా తయారు చేస్తుంది. రెగ్యులర్ గా చికెన్ ని తీసుకునే వాళ్ళు బాగా పొడుగు ఎదుగుతారు.

గుడ్లు:

ఫిట్నెస్ కోసం గుడ్లు బాగా సహాయపడతాయి. వీటిల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఎత్తు పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎముకలను కూడా దృడంగా తయారు చేస్తుంది.

పాలు:

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలల్లో ప్రోటీన్స్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటాయి. ఎముకల్ని దృఢంగా మార్చడానికి ఉపయోగపడతాయి.

బాదం:

బాదంలో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అదే విధంగా దీనిలో ఫైబర్, మెగ్నీషియం కూడా ఉంటాయి. బాదంలో విటమిన్-ఈ కూడా ఉంటుంది. బాదం తీసుకోవడం వల్ల కూడా హైట్ పెరగడం సాధ్యం.

Read more RELATED
Recommended to you

Latest news