Bigboss6.. కన్నీటిని తెప్పిస్తున్న కీర్తీ భట్ లైఫ్ జర్నీ..!

-

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో గ్రాండ్ ఫినాలే కి వెళ్లిన 5 మంది సభ్యుల లైఫ్ జర్నీలను బిగ్ బాస్ వేయడం జరిగింది. మొత్తానికి అయితే మిగతా వారితో పోల్చుకుంటే కీర్తి భట్ లైఫ్ జర్నీ మాత్రం అందర్నీ కన్నీటిని తెప్పించింది. ఇకపోతే తల్లిదండ్రులతో పాటు ఫ్యామిలీ మొత్తం కోల్పోయి అనాధగా బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన కీర్తి గురించి మాట్లాడుతూ.. ఆమెలో కొండంత ధైర్యాన్ని నింపారు బిగ్ బాస్.. కీర్తి గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ…” కీర్తి.. నిజజీవితం కల్పితం కన్నా ఎంతో నాటకీయమైనది.. ఒకవైపు మీ బరువైన గతం మిమ్మల్ని లోపలి నుంచి దహిస్తుంటే.. మీరు చూపించిన నిబ్బరం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అడవిలో మహావృక్షం ఒకటే ఉంటుంది. అది తాను ఒంటరినని బాధపడి తలవంచితే. ఆకాశం తాకే తన ఎదుగుదలను చూడలేదు.

ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరక్క కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు. అయితే సింపతి కోసమే మీ ప్రయత్నం మిగిలిన వాళ్ళు మిమ్మల్ని నిందించినప్పుడు మీ మనసు గాయపడింది. కానీ మీ ఆట ఆగలేదు. గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి. 14 వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత గ్రాండ్ ఫినాలే చేరాలనే కోరిక సాధ్యం కావడానికి మీరు ఒక్కరే కారణం కాదు.. మీ కుటుంబం కూడా ..ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒకటి కాదు.. కొన్ని లక్షలు.. కష్టాల పునాదులపై నిర్మించే విజయాన్ని కలపడం అంత సులభం కాదు”.. అంటూ అద్భుతంగా బిగ్ బాస్ మాట్లాడుతూ అందరి చేత కన్నీటిని తెప్పించారు.

అయితే మిగిలిన కంటెస్టెంట్ కి సంబంధించి బిగ్ బాస్ మాట్లాడిన మాటల్లో అతి.. అంతకుమించిన అబద్ధాలు ఉన్నాయి . కానీ కీర్తి వీడియోలో మాత్రం ఆమె పర్సనల్ లైఫ్ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడి కీర్తితోపాటు అందరికీ కన్నీటిని తెప్పించాడు బిగ్ బాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version