బిగ్ బాస్ ఆరవ సీజన్ చివరి దశకు చేరుకుంది. గత వారం 14వ వారానికి సంబంధించి ఎలిమినేషన్స్ లో భాగంగా లేడీ ఫైర్ బ్రాండ్ ఇనయా ఎలిమినేట్ అవ్వడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చెత్త షో అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే బిగ్బాస్ చరిత్రలో ఇప్పటివరకు లేనివిధంగా ఈ ఆరవ సీజన్లో 6 మంది ఫినాలే కి చేరుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆరవ సీజన్లో గ్రాండ్ ఫినాలే లో బిగ్ బాస్ కంటెస్టెంట్ ల జర్నీ చూపించబోతున్నారు. అంతేకాదు ఆదివారం అర్ధరాత్రి పదిన్నర గంటల నుండి కంటెస్టెంట్ల ఓటింగ్ లైను ఓపెన్ అయిన విషయం తెలిసింది. ఎవరైతే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారో వారి నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వండి అని కూడా నాగార్జున సూచించారు.
ఇకపోతే కంటెస్టెంట్లకు బై బై చెప్పేసిన తర్వాత ఆడియన్స్ కు ఊహించిన విధంగా షాక్ ఇస్తూ ప్రకటన చేశారు హోస్ట్ నాగార్జున. ఇప్పటివరకు గ్రాండ్ ఫినాలే లో టైటిల్ విన్నర్ కోసం 6 మంది పోటీ పడతారని.. అంతా అనుకుంటుంటే.. నాగార్జున మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇలా గ్రాండ్ ఫినాలే లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆదివారం అర్ధరాత్రి నుంచి ఓటింగ్ లెక్కచేయబడుతుందని ఎవరైతే తక్కువ ఓట్లు తెచ్చుకొని చివరి స్థానంలో ఉంటారో వారు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుందని ఆడియన్స్ తో తెలిపాడు నాగార్జున.
ఇకపోతే నాగార్జున చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈసారి ఎవరిని బలి చేయబోతున్నారు అంటూ కూడా మరి కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా టైటిల్ ఫేవర్ రేవంత్ మాత్రం టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.